ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ తారా సుతారియా.. ఇప్పుడు మరో ముందడుగు వేసేందుకు సిద్ధం అవుతోంది. టైగర్ ష్రాప్ జోడీగా ఇటీవలగా.. తర ఆమె నటించిన హీరోపతి 2 చిత్ర ప్రచార కార్యక్రమంతో భాగం కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది తారా. త్వరలో హాలీవుడ్ చిత్రాల్లోకి వెళ్లనున్నట్లు ప్రకటించింది.
ఓ హాలీవుడ్ చిత్రానికి తనను సంప్రదించారని వెల్లడించింది. తన బాలీవుడ్ అరంగేట్రానికి ముందు లండన్‌లో ఉండి వచ్చానని తెలిపిన తారా.. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయని వివరించింది. విదేశాల్లో అవకాశాలున్నా వెళ్లలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు కూడా మరో రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది.
ఓ హాలీవుడ్ చిత్రానికి సంప్రదింపులు జరుగుతున్నాయని.. త్వరలో ఆ వివరాలు చెప్తానని పేర్కొంది. మన నటీనటులు ఎంతోమంది ఇంగ్లీష్ చిత్రాల్లో నటిస్తున్నారని.. తాను ఇంకా ఆలస్యం చేస్తే తర్వాత బాధపడాల్సి ఉంటుందని చెప్పింది.
స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 చిత్రంతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన సుందరి తారా సుతారియా.. గాయనిగానూ పేరు సంపాదించుకుంది. అభిషేక్ బచ్చన్ తో ‘మార్జవాన్’, అహన్ శెట్టితో ‘తడప్’ చిత్రాల్లో నటించి నాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. తను హాలీవుడ్ లోకి రంగప్రవేశం చేయనున్నట్టు వెల్లడించగానే తన అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది.