బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ ఇప్పుడు నటుడిగానే కాదు డైరెక్టర్ గా, నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అమితాబచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి వారితో మే డే సినిమా చేస్తున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీలో అజయ్ దేవగన్ కూడా ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేస్తున్నాడు.
మరోవైపు ఆర్.ఆర్.ఆర్ లో కూడా అజయ్ దేవగన్ అలరించబోతున్నారు. అయితే, హైదరాబాద్ లో ఉన్న ఆయన… ఓ తెలుగు సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు తెలుస్తోంది. బ్రోచేవారెవరురా మూవీని చూసిన అజయ్ రీమేక్ రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగులో ఈ మూవీని వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేయగా… శ్రీవిష్ణు, నివేథా థామస్ నటించారు. తెలుగలోనూ ఈ క్రైం థ్రిల్లర్ మూవీకి మంచి మార్కులే పడ్డాయి.