క్రియేటివ్ దర్శకుడు సుకుమార్… సినిమా వస్తుంది అంటే చాలు ఫాన్స్ లో అంచనాలు అన్నీ ఇన్నీ కాదు. సినిమా ప్రకటన నుంచి విడుదల వరకు కూడా సినిమాపై అంచనాలు ఉంటాయి. రంగస్థలం సినిమా తర్వాత టైం తీసుకుని ఆయన పుష్ప సినిమా చేసారు. ఈ సినిమా మొదటి భాగం మంచి హిట్ కాగా రెండో భాగంపై అంచనాలు పెరిగాయి. రెండో భాగం షూటింగ్ కూడా జరుగుతుంది.
అల్లు అర్జున్ ఈ సినిమా కోసం తీవ్రంగానే కష్టపడుతున్నాడు. కేరళ నటుడు ఫాహాద్ ఫాజిల్ ను విలన్ గా తీసుకున్నారు. రెండో భాగంలో ఉత్తరాది వారిని కూడా తీసుకునే అవకాశం ఉంది. ఒక బాలీవుడ్ నటుడు ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించే అవకాశం ఉందనే టాక్ ఉండగా మరో నటుడి పేరు కూడా ఇప్పుడు ప్రస్తావనకు వచ్చింది. అతనే అర్జున్ కపూర్.
ఈ సినిమాలో మరో పోలీస్ క్యారెక్టర్ ఉండగా ఆ క్యారెక్టర్ లోనే అర్జున్ కపూర్ నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక సాయి పల్లవి, సీనియర్ హీరోయిన్ ప్రియమణి కూడా నటించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశం ఉంది. పుష్ప 3 కూడా ఉండవచ్చు అనే టాక్ కూడా వినపడుతుంది. మరి ఏం జరుగుతుంది… ఏంటి అనేది చూడాలి.