ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడు గా కనిపించనున్నాడు. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ లంకేశ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో సీత పాత్ర పై ఇప్పటికే రకరకాల వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.
కీర్తి సురేష్, కృతిసనన్ వంటి పేర్లు తెరమీదకు వచ్చాయి. మరోవైపు ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్ర లో ఎవరు నటిస్తారు అనేదానిపై కూడా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇప్పటివరకు చిత్రయూనిట్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ తమ్ముడిగా లక్ష్మణుడు పాత్రలో బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చిత్ర యూనిట్ సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.