ఉగ్రమూకలు రిపబ్లిక్ డే సందర్భంగా బాంబ్ దాడులకు ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ఢిల్లీలోని ఘాజీపూర్ లోని పూల మార్కెట్ లో ఐఈడీ బాంబ్ ను గుర్తించారు. సకాలంలో దాన్ని గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
మార్కెట్ దగ్గర బ్యాగ్ ను వదిలేసి పోయారు దుండగులు. స్థానికులు దాన్ని చూసి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. బాంబ్ స్క్వాడ్, ఎన్ఎస్జీకి పోలీసులు సమాచారం అందించారు. ముందుజాగ్రత్తగా అగ్నిమాపక వాహనాలను పిలిపించారు.
బాంబ్ స్వ్కాడ్ సిబ్బంది బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నిర్వీర్యం చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పూల మార్కెట్ ను ఖాళీ చేయించారు అధికారులు. ఇంకెక్కడైనా పేలుడు పదార్ధాలున్నాయేమోనని తనిఖీలు నిర్వహించారు.
రద్దీగా ఉండే మార్కెట్ లో లెదర్ బ్యాగులో ఐఈడీని అమర్చినట్లు వివరించారు పోలీసులు. బాంబ్ ను పేల్చిసిన తర్వాత బ్యాగ్ ను 8 అడుగుల లోతులో పాతి పెట్టినట్లు తెలిపారు. బాంబ్ ను సకాలంలో గుర్తించడం మంచిదయిందని చెప్పారు.