కేరళలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యాలయంపై బాంబు దాడి కలకలం రేపుతోంది. కన్ననూర్ జిల్లాలో పయ్యన్నూర్ లో ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు బాంబు విసిరారు.
ఈ దాడిలో ఆఫీసు కిటికీలు, అద్దాలు, తలుపులు ధ్వంసం అయ్యాయి. ఇద్దరు దుండగులు మోటార్ సైకిల్ పై వచ్చి బాంబులు విసిరినట్టు సీసీ టీవీ పుటేజ్ లో రికార్ట్ అయింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీ టీవీ పుటేజ్ ను సేకరించి దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
దాడి సమయంలో కార్యాలయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారని, అదృష్టవ శాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని పోలీసులు వివరించారు.
దాడి వెనక సీపీఐ(ఎం) హస్తం ఉన్నట్టు బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పయ్యనుర్ సీపీఎం నాయకుడు ధన్రాజ్ వర్ధంతి నేపథ్యంలో ఈ దాడి జరిగినట్టు అనుమానిస్తున్నారు.