అమీర్ పేట మెట్రో స్టేషన్ లో బాంబు కలకలం రేగింది. స్టేషన్ డస్ట్ బిన్ లో ఓ ఎలక్ట్రానిక్ పరికరం వైబ్రేషన్ శబ్ధం రావడం తో అలర్ట్ అయ్యారు సిబ్బంది. దాన్ని బాంబుగా అనుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలిసిన వెంటనే బాంబ్ స్క్వాడ్, ఎస్ఆర్ నగర్ పోలీసులు క్షణాల్లో స్టేషన్ కు చేరుకున్నారు. తనిఖీలు నిర్వహించారు. చివరికి చెత్త డబ్బాలో సెల్ ఫోన్ లభ్యమైంది. అది పని చేయడం లేదని గుర్తించారు. బాంబు లేదని తెలియడంతో మెట్రో సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.