బెంగాల్‌లోని మేధినీపూర్‌లో స్వాధీనం చేసుకున్న బాంబులను బాంబ్ స్వ్కాడ్ నిర్విర్యం చేస్తోంది. పెద్ద సంఖ్యలను బాంబులను డిఫ్యూజ్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
మేధినిపూర్‌లోని హగ్లా అటవీ ప్రాంతంలో స్థానికులు 15 డ్రమ్ములను గుర్తించారు. అనుమానాస్పదంగా ఉండటంతో విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. డ్రమ్మును ఓపెన్ చూసిన పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
ఆ డ్రమ్ముల నిండా పెద్ద ఎత్తున బాంబులను పోలీసులు గుర్తించారు. సుమారు వేయికి పైనే బాంబులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇంత పెద్ద ఎత్తున బాంబులు పట్టుబడటంతో పోలీసు శాఖ ఒక్కసారిగా కలవరం మొదలైంది. వెంటనే బాంబు స్క్వాడ్ కు పోలీసులు సమాచారం అందించారు.
‘ హగ్లా అటవీ ప్రాంతంలో భారీగా బాంబులను స్వాధీనం చేసుకున్నాము. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది. బాంబు స్క్వాడ్ సిబ్బంది వాటిని డిఫ్యూజ్ చేస్తున్నారు’ అని పోలీసులు తెలిపారు. భారీగా బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బక్చా ప్రాంతంలోని హగ్లా అటవీ ప్రాంతంలో వీటిని పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్ అటవీ ప్రాంతానికి చేరుకుంది.