పంజాబ్, హర్యానా, చండీగడ్‌లల్లో కోర్టులకు బెదిరింపు లేఖలు వచ్చాయి. పంజాబ్-హర్యానా హైకోర్టు, చండీగఢ్ జిల్లా కోర్టు, పంచకుల కోర్టులను బాంబులతో పేల్చి వేస్తామంటూ లేఖల్లో దుండగులు పేర్కొన్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే సోదాలు చేపట్టారు.
న్యాయమూర్తి కాంప్లెక్స్ లో బాంబులు పెట్టినట్టు లేఖలో దుండగులు పేర్కొన్నారు. బాంబులు ఒంటి గంటకు పేలుతాయంటూ తెలిపారు. దీంతో పోలీసులు బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. వెంటనే ఆయా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
అక్కడ కోర్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిని వెంటనే బయటకు పంపించారు. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కోర్టులకు బాంబు బెదిరింపు లేఖ వచ్చిందంటూ ఏసీపీ సురేంద్ర యాదవ్ వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
బాంబుల కోసం పోలీసులు తనిఖీలు చేపట్టారు. మొదట మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామంటూ పోలీసులు చెప్పారు. ఆ తర్వాత బెదిరింపు లేఖలు వచ్చిన విషయాన్ని వెల్లడించారు. గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఇలాంటి ఘటన జరగడం భయాందోళనలు కలిగిస్తోంది.