ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టయిన విరసం నేత వరవరరావు బెయిల్ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో విచారణ జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని వరవరరావు భార్య ఈ పిటిషన్ దాఖలు చేసారు. జస్టిస్ SS షిండే, మనీశ్ పిటాలేతో కూడిన డివిజన్ బెంచ్.. విచారణ సందర్భంగా కోర్టు వరవరరావు పరిస్థితిపై సానుభూతి ప్రకటించింది. ఆయన వయసు, ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని NIA, మహారాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. మనమంతా మనుషులమన్న విషయం మరిచిపోకూడదని హితవు పలికింది. బెయిల్ పిటిషన్‌పై విచారణను గురువారానికి వాయిదా వేసింది.
88 ఏళ్ల వరవరరావు.. జైలులో ఉండగా అనారోగ్యం బారిన పడ్డారు. హైకోర్టు ఆదేశాలతో ముంబయి నానావతి ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.