బోండా ఉమ, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు
భవన నిర్మాణ కార్మికుల నిధుల గోల్ మాల్ పై కేంద్రం విచారణ జరిపించాలి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు పనులు లేక పస్తులు ఉంటున్నారు. అది చాలదు అన్నట్లు వారి సంక్షేమ నిధి నుంచి కోట్ల రూపాయిలను వైసీపీ లెక్కలు లేకుండా తప్పించింది.
భవన నిర్మాణ కార్మికులను జగన్ ప్రభుత్వం మోసం చేయటం దుర్మార్గం. కంచె చేను మేస్తే ఇక కార్మికులకు దిక్కెవరు. 60 లక్షల మందిని జగన్ మోసం చేశారు. వారందరికీ టీడీపీ అండగా ఉండి పోరాడుతుంది. వెంటనే ఇక్కో కార్మికుడికి రూ.10 వేలు ఇవ్వాలి.