వల్లభనేని వంశీ రాజీనామాతో గరంగరంగా ఉన్న రాజకీయాలు మరింత వేడేక్కాయి. ఇప్పటి వరకు టీడీపీ నుండి వంశీపై పెద్దగా అటాక్ స్టార్ట్ కాలేదు. చంద్రబాబు కూడా సాఫ్ట్‌గానే మాట్లాడటంతో… కూల్‌గా ఉన్న టైంలో, బోండా ఉమ కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.
వల్లభనేని వంశీ రాజీనామా చేశానంటూ వాట్సాప్ మెసేజ్ లతో న్యూసెన్స్ చేస్తున్నారన్నారు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ. మూడు రోజుల్లో ముగ్గురు నేతలను వంశీ కలిశాడు, రేపు చంద్రబాబుని కూడా కలిసిన కలవచ్చు. శాసన సభ పదవిని వదులుకోవాలంటే స్పీకర్ ఫార్మాట్ లో లేఖ ఇవ్వాలి అని ఫైర్ అయ్యారు. వంశీ చేసిన వాట్సాప్ మెసేజ్ లు నాలుక గీసుకోటానికి కూడా పనికిరావన్నారు ఉమ.
పనికిరాని వాట్సాప్ మెసేజ్ లు పట్టుకుని వంశీ రాజీనామా చేసాడని అనుకోలేమన్నారు బోండా. పార్టీ కి రాజీనామా చెయ్యాలి అనుకున్నవాళ్ళు డైరెక్టుగా చేస్తారు. కానీ ఈ మెసేజ్ లతో ఈ రాజీనామాలు ఏంటో నాకు అర్ధం కావట్లేదన్నారు.