బూతుల పై త్వరలో ఓ మంత్రిశాఖని కూడా వైసీపీ పెట్టేలా కనిపిస్తుందన్నారు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా. చంద్రబాబు మీద కక్షతోనే రాజధానిని వైసీపీ స్మశానంగా పోల్చుతుందన్నారు. కొడాలి నాని దున్నపోతులు, పందులు అమరావతికి వస్తున్నాయంటూ మాట్లాడారు. పరిపాలన భవనాలు, హైకోర్టు టీడీపీ ప్రభుత్వం పూర్తిచేసింది. అలాంటి రాజధానిని, 150 వైసీపీ పశువులు నాశనం చేస్తున్నాయి. మంత్రి కొడాలి నాని ఒక బూతుల మంత్రి, స్పీకర్ కూడా బూతుల స్పీకర్ గా మారిపోయారన్నారు.
రెండు లక్షల కోట్ల అవినీతి జరిగిందన్న వైసీపీ, రెండు లక్షల అవినీతి కూడా బయట పెట్టలేకపోయారన్నారు. వైసీపీ చేతకానితనంతో రాష్ట్రం అధోగతి పాలవుతుందంటూ విమర్శించారు.