వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ కి తీసుకుని వచ్చిన పరిశ్రమల లిస్ట్ గురించి అందరికీ తెలియజేయాలంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా డిమాండ్ చేశారు. పరిశ్రమలు ఎన్ని వచ్చాయి అనే దాని మీద శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన కోరారు.
విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన దావోస్ పర్యటనకు వెళ్లినప్పుడు చంద్రబాబు సీఎం గా ఉన్నారు.ఆ సమయంలో ఆయన 9 సార్లు కూడా ఏపీకి పెట్టుబడులు తీసుకుని వచ్చారు.ఇప్పుడు కూడా దావోస్ లో సదస్సులు జరుగుతున్నాయి.
వాటికి పొరుగు రాష్ట్రమైన తెలంగాణ మంత్రి కేటీఆర్ వెళ్లారు. కానీ జగన్ మాత్రం ఇప్పటికీ ఒక్కసారి మాత్రమే దావోస్ పర్యటనకు వెళ్లారు. 4 ఏళ్లలో ఏపీకి జగన్ తీసుకు వచ్చింది ఏంటి అంటే మద్యం, ఫిష్ మార్కెట్లు మాత్రమే అని ఎద్దేవా చేశారు.
గడిచిన నాలుగేళ్లలో జగన్ తెచ్చిన పరిశ్రమల గురించి వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ అవినీతి దెబ్బకు పారిశ్రామిక వేత్తలు ఏపీకి రావాలి అంటే వణికిపోతున్నాయన్నారు.అసలు ఈ ఏడాది దావోస్ పర్యటనకు ఏపీ నుంచి ఒక్కరు కూడా వెళ్లలేదు. ఏపీ ఐటీ మంత్రి కోడి పందాలు, పేకాట ఆడుతున్నారని ఫైర్ అయ్యారు.