సీబీఐ నోటీసులు వచ్చాయన్న వార్తలపై మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ స్పందించారు. తనకు ఎలాంటి సీబీఐ నోటీసులు రాలేదని ఆయన స్పష్టం చేశారు.
తనకు నోటీసులు వచ్చినట్టు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. శ్రీనివాస్ తనకు కమ్యూనిటీ ఫంక్షన్‌లో పరిచయమయ్యాడని ఆయన తెలిపారు.
శ్రీనివాస్ కార్యకలాపాలతో తమకు సంబంధం లేదన్నారు. ఒక వేళ దర్యాప్తు సంస్థలు పిలిస్తే విచారణకు హాజరై సమాధానం చెప్తామని వెల్లడించారు.
కేంద్రం కక్షపూరితంగానే టీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తోందని మండిపడ్డారు. బెట్టింగ్ వ్యవహారంలో తన ప్రమేయం లేదని చెప్పారు. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎవరో తనకు తెలియదన్నారు.
రాజకీయ కుట్రలో భాగంగానే తన పైనా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. తమ నేతల్ని టార్గెట్ చేస్తున్నారన్నారు. నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు.