అంతర్జాతీయ సాహిత్య వేదికపై భారత రచయిత్రి గీతాంజలీ శ్రీకి అద్భుతమైన గౌరవం లభించింది. ఆమె రచించిన ‘రేత్ సమాధి’ నవలకు బుకర్ ప్రైజ్ లభించింది.
దీంతో భారతీయ భాషలో రచనకు బుకర్ ఫ్రైజ్ అందుకున్నతొలి భారత రచయిత్రిగా ఆమె చరిత్ర సృష్టించారు.ఈ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించిన డైకీ రాక్ వేస్ తో కలిసి ఆమె ఈ అవార్డును అందుకున్నారు. లండన్ లో జరిగిన ప్రదానోత్సవంలో ఆమె బుకర్ ప్రైజ్ అందుకున్నారు.
రేత్ సమాధి అనే నవల ఉత్తర భారతంలోని ఎనభై ఏండ్ల వృద్ధురాలికి సంబంధించినది. భర్త మరణంతో ఆ వృద్ధురాలు తీవ్ర డిప్రెషన్ లోకి వెళుతుంది.ఆ తర్వాత ఆమె జీవితం కొత్తగా ఎలా మారుతుంది అనేదే నవలా కథ.
Advertisements
బుకర్ ప్రైజ్ రావడంపై ఆమె సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. బుకర్ వస్తుందని, తాను అసలు ఊహించలేదన్నారు.ఇది తన జీవితంలో గొప్ప అద్భుతమని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.