మద్యం టెండర్ల ద్వారా భారీగా ఆధాయాన్ని సమకూర్చుకోవాలనుకున్న తెలంగాణ ప్రభుత్వానికి అనుకన్నట్లే కాసుల వర్షం కురుస్తోంది. రాష్ట్రంలో మద్యం అమ్మకాల కోసం షాపులు కేటాయించనుంది. లక్కీడ్రా ద్వారా ఎంపిక చేయనున్నారు. రాష్ట్రంలో 2216 మద్యం షాపులకు గాను.. 48401 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్‌శాఖ వెల్లడించింది. కేవలం షాపుల ఎంపిక ద్వారానే ప్రభుత్వానికి 968కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.
ఒక్కో దరఖాస్తుకు 2లక్షలు నాన్-రిఫండబుల్ అమౌంట్‌గా ప్రభుత్వం నిర్ణయించింది.