మన దేశంలో కరోనా కేసులు చాలా వరకు కూడా పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి అనేది కాస్త ఆసక్తి రేగుతుంది. రోజు రోజుకి కరోనా కేసుల దెబ్బకు ఇప్పుడు లాక్ డౌన్ అనే ఆలోచన కూడా మొదలయింది అనే ప్రచారం జరుగుతుంది. ఓమిక్రాన్ అనే కరోనా వేరియంట్ దెబ్బకు ఇప్పుడు మరోసారి కేసులు పెరిగే అవకాశం ఉందని, దక్షినాది రాష్ట్రాలకు ముప్పు ఎక్కువగా ఉందనే ప్రచారాన్ని కాస్త గట్టిగానే మొదలుపెట్టారు.
అది ఎంత వరకు నిజం ఏంటీ అనే దాని మీద క్లారిటీ లేకపోయినా ఇప్పుడు వ్యాక్సిన్ మరో డోస్ వేయాలనే డిమాండ్ లు కూడా కొందరు చేయడం గమనార్హం. ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగానే ఒమిక్రాన్ భయం భారతదేశాన్ని పట్టి పీడించగా నిర్వహించిన కొన్ని పరీక్షలతో ఓమిక్రాన్ గురించి ఆందోళన వద్దనేది అర్ధమైంది. వ్యాక్సిన్ సమర్థత గురించి అనేక ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ… యూరప్ మరియు యునైటెడ్ స్టేట్స్‌లోని అనేక రాష్ట్రాలు బూస్టర్ షాట్‌లను ప్రారంభించాయి.
ఈ నేపధ్యంలో ఇండియా లో కూడా స్టార్ట్ చేయాలనే డిమాండ్ వినపడుతుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చీఫ్ డాక్టర్ బలరాం భార్గవ దీనిపై ప్రకటన చేసారు. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, ఒక నివేదిక ఆధారంగా దీనిపై ముందుకు వెళ్తామని అన్నారు. వ్యాక్సినేషన్ వేగవంతం చేసామని కాని ఓమిక్రాన్ కంటే కూడా డెల్టా నే భయంకరం అని, అది ఇంకా ఇండియాలో ఉందని అన్నారు. ఓమిక్రాన్ వేరియంట్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ లు ఎంత వరకు పని చేస్తాయి అనే దాని మీద వాటి సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నామన్నారు.