ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. ఆసిస్ మొదటి ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖవాజా శతకం(104*) బాదాడు. మరో బ్యాట్స్ మెన్ కామెరూన్ గ్రీన్(49*) నిలకడగా ఆడుతున్నాడు. మొదటి రోజు కంగారుల జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది.
ఓపెనర్ ట్రావిస్ హెడ్(32) పర్వాలేదని అని పించాడు. ఆ తర్వాత వచ్చిన లబు షేన్ కేవలం 3 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత పీటర్ హ్యాండ్‌కాంబ్(17) కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. స్టీవెన్ స్మిత్(38) పరుగులు చేశారు.
భారత బౌలర్లలో మహ్మద్ షమీ (2), ఉమేశ్ యాదవ్, జజేజా చెరో వికెట్ తీశారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 44 బంతులు ఆడి 32 పరుగులు చేశాడు. అనంతరం రవిచంద్ర అశ్విన్ బౌలింగ్ లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత లబు షేన్‌ను కేవలం మూడు పరుగులకే మహ్మ ద్ షమీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
లంచ్ బ్రేక్ సమయానికి ఆసీస్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. ఆ తర్వాత సెకండ్ సెషన్ నుంచి ఆసీస్ బ్యాటర్లు ఆచితూచి ఆడారు. టీ బ్రేక్ తర్వాత రవీంద్ర జడేజా బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్(38) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పీటర్ హ్యాండ్స్‌కాంబ్ (17) షమీ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.
కాంబ్ తర్వాత క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్ దూకుడుగా ఆడాడు. ఖవాజాతో కలిసి నెమ్మదిగా ఆడుతూ జట్టు స్కోరును పెంచారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ హాజరై వీక్షించారు.