బోర్డర్ గవాస్కర్ ట్రోపిలో తొలి టెస్టులో మొదటి రోజు ఆస్ట్రేలియాపై భారత్ పై చేయి సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసిస్ జట్టును భారత్ తక్కువ పరుగులకే కట్టడి చేయగలిగింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు ఒక వికెట్ కోల్పోయి 77 పరుగులు చేసింది.
ఓపెనర్ గా క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ 20 పరుగులు చేశాడు. నిలకడగా ఆడుతున్న రాహుల్ ను టాడ్ ముర్ఫీ పెవిలియన్ చేర్చాడు. మరో ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అర్థ సెంచరీ చేశాడు. ఆట ముగిసే సమయానికి 66 బంతుల్లో 56 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు.
కేఎల్ రాహుల్ తర్వాత వచ్చిన అశ్విన్ పరుగులేమి చేయకుండా నాటౌట్ గా ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్లో టాస్ గెలిచి కంగారులు బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఆసిస్ జట్టు 63.5 ఓవర్లలో 177 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది. ఆసిస్ బ్యాటర్లలో లబుషేన్ (49) పరుగులతో రాణించాడు.
ఆ తర్వా త వచ్చిన స్టీవెన్ స్మిత్ (37), హ్యాండ్స్కోంబ్ (31), అలెక్స్ (36) పరుగులతో పర్వాలేదనిపించారు. భారత బౌలర్లు విజృంభించి ఆసిస్‌ను తక్కువ పరుగులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో జడేజా 5 వికెట్లు తీశాడు. అశ్విన్ 3, సిరాజ్, షమీ చెరో వికెట్ తీశారు. ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 100 పరుగుల వెనుకంజలో ఉంది.