బోర్డర్ గావస్కర్ ట్రోఫిలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసింది. టీమిండియా బౌలర్ల దెబ్బకు ఆసిస్ తమ తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులకు ఆలౌట్ అయింది. వికెట్లు నష్టపోకుండా 25 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (18), కేఎల్ రాహుల్ (12) పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆసీస్ 263 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ల దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు తోకముడిచారు. ఒకరి తర్వాత ఒకరుగా పెవిలియన్ చేరారు.
అటు కంగారు బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా (81), పీటర్ హ్యాండ్స్ కాంబ్ (72) పరుగులతో అద్భుత ప్రదర్శన చేశారు. ఆసీస్ స్కోరు బోర్డును పరుగెత్తించారు. మరో ఆసీస్ బ్యాటర్ కమిన్స్ (33) ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో షమీ 4 వికెట్లు తీశాడు. జడేజా, అశ్విన్ చెరో మూడు వికెట్లు పడగొట్టి ఆసీస్ ను పెద్ద దెబ్బ తీశారు.
ఈ మ్యాచ్ లో టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుత క్యాచ్ పట్టాడు. మహ్మద్ షమీ వేసిన లాంగ్ లెంత్ బాల్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ బ్యాటుకు చివరకు తగిలి.. సెకండ్ స్లిప్ మీదుగా ఫీల్డర్ రాహుల్ వద్దకు వెళ్లింది. దీంతో మోకాళ్లపై పడి రాహుల్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. దీంతో ఆసీస్ 108/4 వద్ద 31.2 ఓవర్ లో ట్రావిస్ ఔట్ అయ్యాడు. కాగా రాహుల్ కొన్ని రోజులుగా తన రాణించలేకపోతున్నాడు.