ప్రస్తుతం విచిత్రమైన బట్టలన్నీ మార్కెట్లోకి వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే యువత కూడా ట్రెండీగా ఉండేందుకు ఇష్టపడుతోంది. కొత్త కొత్త వెరైటీలన్నింటినీ వేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ విచిత్రమైన పలాజో ప్యాంటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే గోనెసంచితో తయారు చేసిన ప్యాంట్.
గోనెసంచితో ప్యాంట్ ఎంటా అని షాక్ అవుతున్నారా? ఇది నిజమే. అలాగే ఈ ప్యాంటు ధర వింటే నోరెళ్లబెడతారు కూడా. సాధారణంగా వడ్లు, బియ్యం, చిరు ధాన్యాలు నింపుకునేందుకు వీటిని ఉపయోగిస్తూంటారు. ఇప్పుడు బట్టలు కూడా తయారు చేసేస్తున్నారు.
హోలీ ఫ్యాషన్ అనే కంపెనీ ఈ గోనె సంచి పలాజో ప్యాంట్ తయారు చేసింది. దాని ధర రూ,65,000 ఉంది. అంత ధర పెట్టి గోనె సంచిని ఎవరు కొంటారనుకోకండి. చాలామంది ఈ గోనె సంచి పలాజోని ఎగబడి కొంటున్నారు.
ఈ పలాజోని వీడియో తీసి సచ్కద్వాహై అనే నెటిజన్ ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో అప్ లోడ్ చేశారు. ‘ఈ పలాజోని రూ.60వేలు పెట్టి కొంటారా?’ అని క్యాప్షన్ ఇచ్చాడు. అంతే ఇంకేముంది క్షణాల్లోనే లక్షల్లో లైక్స్, వేలల్లో కామెంట్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.