రెండు రోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ చేరుకున్నారు. ఆయనకు సబర్మతి ఆశ్రమం నుంచి రెండు అరుదైన గిఫ్ట్ లను అందజేయనున్నారు. అధికార వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
ఆయనకు మడేలిన్ స్లేడ్ (మీరా బెహన్) రచించిన ‘ ది స్పిరిట్స్ పిలిగ్రిమేజ్’ అనే పుస్తకాన్ని అందజేయనున్నారు. మడేలిన్ బ్రిటన్ కు చెందిన మహిళ. ఆమె మహాత్మ గాంధీ శిష్యురాలు. బ్రిటన్ పౌరురాలైనప్పటికీ భారత స్వాతంత్ర్య పోరాటానికి మద్దతు తెలిపారు.
దీంతో పాటు మహాత్మగాంధీ తొలి నాళ్లలో రాసిన ‘ ది గైడ్ టూ లండన్’ అనే పుస్తకం( ముద్రించలేదు)ను ఆయనకు అందజేయనున్నారు. బ్రిటన్ ప్రధాని జాన్సన్ గురువారం గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ స్వాగతం పలికారు.
ఆయనకు గుజరాతి పాంప్రదాయ సంగీతంతో అధికారులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఆయన బస చేయనున్న హోటల్ వరకు రోడ్ షో నిర్వహించారు. దీని పట్ల బ్రిటన్ ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు.