రాజధాని రైతులు ఎవరు భయపడాల్సిన పనిలేదన్నారు మినిస్టర్ బొత్స. రాజధాని పై 27 న కాబినెట్ లో చర్చించిన తరువాత నిర్ణయం ప్రకటిస్తాము. గతంలో రాజధాని పేరుతో భూముల దోపిడి జరిగింది. రైతుల పేరుతో టీడీపీ నేతలు దోచుకున్నారు. ఇప్పడు చంద్రబాబు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని ఆరోపించారు బొత్స. గత ఐదు సంవత్సరాల్లో ప్రజలకు ఒరిగింది ఏమి లేదు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూల్ లో హై కోర్ట్, అమరావతిని ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చెయ్యాలని కమిటీ సిఫార్సు చేసిందని తెలిపారు బొత్స. ఐదు ఏళ్లలో విశాఖలో ఎటు వంటి అభివృద్ధి జరగలేదు. రాజధాని రైతులు ఎవ్వరూ భయపడవద్దని చెప్పుకొచ్చారు బొత్స.