బొత్స సత్యనారాయణ, ఏపీ మంత్రి
ఏపీకి ప్రత్యేక హోదా విషయం విభజన చట్టంలో ఉంది. రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం హోదా విషయంలో కట్టుబడి ఉంది. సాధించే వరకు పోరాటం చేస్తాం. కేంద్రం ఇచ్చిన హామీని నెరవేర్చాలి.
గతంలో సీఎం జగన్.. ప్రధానిని, ఇతర కేంద్ర మంత్రులను కలిసిన సమయంలోనూ.. పార్లమెంట్ లోనూ ప్రత్యేక హోదాపై వైసీపీ ఎంపీలు తమ గళం వినిపించారు. రాజధాని ఏర్పాటు అంశం రాష్ట్రాల ఇష్టమే అని కేంద్రం ప్రకటించింది. ఆ మేరకు ఏపీలో రాజధాని ఏర్పాటుపై మరోసారి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
మూడు రాజధానుల నిర్ణయం మా విధానం. ఎవరు ఎన్ని చెప్పినా ఏర్పాటు చేస్తాం. మూడు రాజధానుల బిల్లులో లోపాలు సవరించి కొత్తది తీసుకొస్తాం. విశాఖకు రాజధాని రావటం తథ్యం. పరిపాలనా రాజధాని వచ్చి తీరుతుంది. ఇందులో ఎటువంటి సందేహాలు అక్కర్లేదు.
సాంకేతిక కారణాల వలన మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నాం. విస్తృతమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని మరోసారి బిల్లు పెడతాం. మళ్లీ మూడు రాజధానుల ఏర్పాటు కోసం బిల్లు పెడతామని ముఖ్యమంత్రి జగన్ ఇది వరకే అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు.