ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మ ఒడి కార్యక్రమం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. విజయనగరంలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. ఈ పథకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మ ఒడి పథకం 75 శాతం అటెండెన్స్ ఉన్న విద్యార్థులకే ఇస్తున్నామని తెలిపారు.
పిల్లలను పాఠశాలకు క్రమం తప్పకుండా పంపించే బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందన్నారు బొత్స. విద్యార్థి బడి మానకూడదన్నదే అమ్మ ఒడి ముఖ్య ఉద్దేశ్యమన్నారు. రెండు వేల రూపాయలు కోత విధించింది నిజమేనన్నారు మంత్రి. అందులో ఒక వెయ్యి మెయింటెనెన్స్ కోసం అయితే. మరో వెయ్యి రూపాయలు వాచ్ మెన్, అలాగే పలు అవసరాలకు వినియోగించాలని నిర్ణయించామన్నారు.
విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిర్మించిన వాటర్ ట్యాంక్ ను ప్రారంభించిన మంత్రి.. ఇంటింటికి కుళాయిలు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. జిల్లాలో మరో అయిదు భారీ ట్యాంకులు ఏర్పాడు చేశామని వివరించారు మంత్రి. తమ పార్టీ ప్రతినిధులు వార్డుల్లో పర్యటించి ప్రజలకు కుళాయిలు ఏర్పాటుపై చర్యలు తీసుకుంటారని వివరించారు మంత్రి.
Advertisements
ఏడువేల ఆరు వందల రూపాయలతో కేఎల్ నీటిని స్టోర్ చేసి ప్రజలకు అందించాలని నిర్ణయించామన్నారు మంత్రి బొత్స. గత ప్రభుత్వం డబ్బులు కట్టించుకుని కూడా నీళ్లు ఇవ్వలేకపోయిందని విమర్శించారు. బీపీఎల్ కాని వాళ్లకు కేవలం అరువేలు కడితే నీటి కుళాయి అందిస్తామని ప్రకటించారు బొత్స సత్యనారాయణ.