విజయవాడ : రాజధానిలో ఇన్‌సైడ్ ట్రేడింగు జరిగిందని, ఆ వివరాలు సరైన సమయంలో బయటపెడతామని మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్ చేశారు. ఇన్‌సైడ్ ట్రేడింగ్‌పై ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే…
రాజధానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగింది…
రాజధానిలో భూ అక్రమాలపై మా దగ్గర పూర్తి సమాచారం ఉంది.
సరైన సమయంలో భూ అక్రమాల చిట్టా బయటపెడతాం.
మీడియా మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం లేదు.
మాజీ కేంద్ర మంత్రి.. ప్రస్తుత ఎంపీ రాజధానిలో నాకు భూములే లేవంటున్నారు..
సవాల్ విసిరితే మొత్తం బయట పెడతాం.
నాలుగు రాజధానుల విషయం టీజీనే అడగండి.
పవన్ కళ్యాణ్ గతంలో ఏం మాట్లాడారో.. ఇప్పుడేం మాట్లాడారో చూడండి.
గతంలోనూ.. ఇప్పుడూ పవన్ ఏం మాట్లాడారో రికార్డులు చూస్తే తెలుస్తుంది.
బీజేపీ కూడా గతంలో రాజధానిపై ఆరోపణలు చేసింది.
రాజధాని అంటే ఏ ఒక్క సామాజిక వర్గానికో చెందింది కాదు.
కౌలు అందడం లేదని రాజధాని రైతులు నా దగ్గరకు వచ్చారు..
త్వరలోనే పరిష్కరిస్తాం.