మెగాస్టార్ చిరంజీవికి వైసీపీ రాజ్యసభ సీటు ఇవ్వనుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. త్వరలో ఏపీలో ఖాళీ అవ్వబోయె నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి చిరుకు కట్టబెడతారని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ విషయమై మంత్రి బొత్సను మీడియా ప్రతినిధులు వివరణ కోరారు. ఇందుకు ఆయన స్పందిస్తూ చిరంజీవికి తమ పార్టీ నుంచి రాజ్యసభ సీటు ఇస్తామని గాని, ఇవ్వమని గాని చెప్పలేదు. పార్టీ ప్రయోజనాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
రాజ్యసభ సీటు రేసులో వైసీపీ నుంచి ఎవరెవరు రేసులో ఉన్నారని మంత్రి బొత్సను ప్రశ్నించగా.. తమ లిస్టులో ఎవరున్నారు అనే విషయాన్నీ ఇప్పుడే ఎలా చెబుతామని ఆయన ఎదురు ప్రశ్న వేశారు. ఇక.. మంత్రి బొత్స వ్యాఖ్యలను బట్టి చిరంజీవికి రాజ్యసభ సీటు ఇచ్చే విషయమై వైసీపీ ఆలోచిస్తుందనే విషయం అర్థమైంది.