రాజమహేంద్రవరం: దేవిపట్నం మండలం కచ్చులూరు దగ్గర పాపికొండల పర్యాటక బోటు ప్రమాదం చూసేవారికి హృదయ విదారకంగా ఉంది. సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ప్రమాదం నుంచి బయటపడిన 16 మందికి ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. బోటు డ్రైవర్లు నూకరాజు, తామరాజు మరణించారు. ఇప్పటి వరకు 9 మృత దేహాలు వెలికి తీశారు.
ప్రమాదానికి గురైన బోటులో పరిమితికి మించి ప్రయాణికుల్ని ఎక్కించారని తెలుస్తోంది. ప్రమాద ప్రదేశంలో గతంలోనూ ప్రమాదాలు జరిగాయని, ఆ ప్రదేశంలో పెద్ద రాయి ఉందని, దాని వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని అంటున్నారు. వరద ఉధృతికి బోటు అడుపు తప్పిందని, ఒక కొండ రాయిని ఢీకొందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.