ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఉద్యమం మరింత తీవ్రమవుతుంది. రైతుల ఉద్యమానికి ఎన్నో సంఘాలు, పార్టీలు మద్ధతు పలుకుతుండగా… బాక్సర్ విజయేందర్ సింగ్ కూడా తన మద్దతు ప్రకటించారు. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోకుంటే తన రాజీవ్ ఖేల్ రత్న అవార్డును వెనక్కి ఇచ్చేస్తానన్నారు.
2019లో కాంగ్రెస్ లో చేరిన విజయేందర్ లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. రైతు ఆందోళనలు కొనసాగుతుండటంతో వారికి మద్దతుగా జాతీయ బాక్సింగ్ కోచ్ గుర్‌ప్రకాష్ సంధు తనకు ప్రదానం చేసిన ద్రోణాచార్య అవార్డును ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు.
ఇక ఇప్పటికే రైతులకు మద్దతుగా పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ తనకిచ్చిన పద్మవిభూషణ్ అవార్డును తిరిగి ఇచ్చేస్తానని ప్రకటించగా, శిరోమణి అకాలీ దళ్ చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా తన పద్మభూషణ్ అవార్డును వాపసు ఇచ్చారు. పంజాబ్‌కు చెందిన భారతీయ సాహిత్య అకాడమీ అవార్డు విజేతలైన డాక్టర్ మోహన్ జిత్, డాక్టర్ జస్వీందర్ సింగ్, పంజాబీ ట్రిబ్యూన్ ఎడిటర్ స్వరాజ్‌బీర్‌లు తమ అవార్డులను వాపస్ చేస్తున్నట్లు ప్రకటించారు.