నా పెన్సిల్ పోయింది సార్… వీడే తీసేసాడు వీడి మీద కేసు పెట్టండి అంటూ ఓ బుడతడు పోలీసు స్టేషన్ కి వచ్చాడు. ప్రతిరోజు నా పెన్సిల్ ని తీసేస్తున్నాడు అంటూ పోలీసులకు చెప్పాడు ఆ బుడతడు. ఈ ఘటన కర్నూలు జిల్లా పెద కడుబూరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నలుగురు పిల్లలు పోలీసు స్టేషన్ కి వచ్చారు. ఈ నలుగురు కూడా వారి పెన్సిల్ గొడవని పోలీసులకు చెబుతుండగా పోలీసులు అందుకు సంబంధించిన వీడియోని రికార్డు చేశారు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు రా అని పోలీసు అతను అడగగా… కేసు పెట్టండి సార్ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే పెద్ద మనసు చేసుకుని ఈ సారికి రాజీ అవ్వరా అంటూ పోలీసులు కోరగా ఈ ఒక్కసారికి రాజీ అవుతానని చెప్పాడు. ఈ వీడియో వైరల్ అవుతుంది.