ఇప్పుడు మన తెలుగులో కొందరు దర్శకులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అందులో బోయపాటి శ్రీను ఒకరు. అఖండ సినిమా తర్వాత ఆయనకు క్రేజ్ బాగా పెరిగింది. ఇప్పుడు ఆయనతో సినిమాలు చేసేందుకు యువ హీరోలు కూడా ఆసక్తిగా ఉన్నారు. అయితే యువ హీరోలకు మాత్రం ఆయన పెద్దగా కలిసి రాలేదని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. దాని వెనుక బలమైన కారణాలే ఉన్నాయి.
ఆయన గతంలో యువ హీరోలతో చేసిన సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. తనకు లైఫ్ ఇచ్చిన అల్లు అర్జున్ తో సరైనోడు అనే సినిమా చేసాడు బోయపాటి. ఆ సినిమా అనుకున్న విధంగా ఫలితం ఇవ్వలేదు. అలాగే రామ్ చరణ్ హీరోగా చేసిన వినయ విదేయ రామ సినిమా కూడా హిట్ కాలేదు. ఆ సినిమా బోయపాటి కెరీర్ లోనే అతిపెద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమాపై మెగా ఫాన్స్ ఎన్నో విమర్శలు చేసారు.
అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో దమ్ము సినిమా చేసాడు. ఆ సినిమా కూడా భారీ ఫ్లాప్ అయింది అని చెప్పాలి. ఇక బెల్లంకొండ హీరోతో ఒక సినిమా చేసాడు. జయ జానకి నాయక సినిమా చేయగా అది యావరేజ్ గా ఆడింది. ఇలా యువ హీరోలతో ఏ సినిమా చేసినా హిట్ కాలేదు. ప్రస్తుతం యువ హీరో రామ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది.