మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న దర్శకుడు బోయపాటి శ్రీను. ప్రస్తుతం బాలయ్యతో అఖండ సినిమా చేస్తూ బిజీగానే ఉన్నాడు. ఓ సినిమా పూర్తయ్యాకే మరో సినిమాపై దృష్టిపెట్టే అలవాటున్న బోయపాటి… కరోనా ఫ్రీ టైం వల్ల అఖండ పూర్తికాక ముందే తన తర్వాత ప్రాజెక్టులపై ఫోకస్ చేశాడు.
అల్లు అర్జున్ తో సరైనోడు మూవీ తీసిన సమయంలోనే మరో సినిమా చేసేందుకు గీతా ఆర్ట్స్ భారీ అడ్వాన్స్ ఇచ్చింది. అఖండ తర్వాత బన్నీతో సినిమా చేయాలని బోయపాటి నిర్ణయానికొచ్చాడు. ఇటీవల బన్నీ, బోయపాటి కలిసి సినిమాపై చర్చించారు. అయితే, బన్నీకి ఉన్న కమిట్మెంట్స్ తో ఇప్పట్లో ఈ సినిమా పట్టాలెక్కేలా లేదు.
ఇక రవితేజతో సినిమా చేయాలని బోయపాటికి మరో కమిట్మెంట్ ఉంది. కానీ రవితేజ కూడా వరుసగా సినిమాలు ఒప్పుకొని… డేట్స్ అడ్జెస్ట్ చేసే పరిస్థితుల్లో లేడు. దీంతో బోయపాటికి మరికొంత కాలం వెయిటింగ్ తప్పేలా లేదు.