అఖండ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. మరోవైపు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ తో ఉన్నాడు రామ్ పోతినేని.
అయితే ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి పాన్-ఇండియన్ సినిమా కోసం చేతులు కలిపారు.ఈ క్రేజీ కాంబో చిత్రాన్ని రామ్ పోతినేని హీరోగా లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది వారియర్ సినిమా నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారు.
ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుందని చిత్రబృందం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisements
ఇక ప్రస్తుతం రామ్ లింగు స్వామి దర్శకత్వంలో ది వారియర్ సినిమా చేస్తున్నాడు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రామ్ నటిస్తున్నాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.