డిసెంబర్ 2న థియేటర్స్ లో రిలీజ్ అయిన అఖండ చిత్రం అఖండమైన విజయం సాధించింది. నందమూరి బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను అఖండ పాత్రతో ఆకట్టుకున్నాడు. బాలకృష్ణ కెరీర్ లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ ను బుధవారం హైదరాబాద్ లో నిర్వహించారు మేకర్స్. ఈ సక్సెస్ మీట్ లో డైరెక్టర్ బోయపాటి శ్రీను అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
అదేంటంటే బాలయ్య అఖండ సినిమాకు సీక్వెల్ గా మరో చిత్రం రాబోతుందట. ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేశారు బోయపాటి. మిగిలిన డీటెయిల్స్ ని మాత్రం చెప్పలేదు. ప్రస్తుతానికి మాత్రం బోయపాటి ఇచ్చిన ఈ అప్డేట్ బాలయ్య అభిమానుల్లో మంచి జోష్ ని నింపింది.