మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నాడు. అందులో ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మిగిలిన మూడు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా కొత్త స్క్రిప్ట్‌లు వినడానికి ఆసక్తి చూపిస్తున్నాడట చిరంజీవి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… అఖండ సినిమాతో మంచి హిట్ అందుకున్న బోయపాటి శ్రీనుతో కలిసి పనిచేయాలని ఆలోచిస్తున్నాడట చిరు. నిజానికి వినయ విధేయ రామ విడుదలైన వెంటనే, చిరంజీవి బోయపాటి శ్రీను కలయిక లో ఓ ప్రాజెక్ట్ రావాల్సి ఉంది.
వినయ విధేయ రామ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కూడా బోయపాటి శ్రీనుతో చర్చలు జరుపుతున్నట్లు చిరంజీవి బహిరంగంగా ధృవీకరించారు. అయితే వినయ విధేయ రామ విడుదలైన తర్వాత చిరు కానీ, బోయపాటి కానీ సినిమా గురించి ప్రస్తావించలేదు.
అయితే ఇప్పుడు అఖండ విజయంతో బోయపాటి శ్రీనుకు మళ్లీ డిమాండ్ పెరిగింది. ఇప్పటికే, అల్లు అర్జున్ ని కూడా బోయపాటి లైన్ లో పెట్టాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో సరైనోడు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏదేమైనా చిరంజీవి, బోయపాటి శ్రీను సినిమా అంటే మాత్రం మాస్ ప్రేక్షకులకు జాతరనే చెప్పాలి. మరి చూడాలి ఏం జరుగుతుందో.
Advertisements
Also Read: పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్… వేరే లెవెల్ !!