బీఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య ఘటనపై హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ హెచ్చార్సీని ఆశ్రయించారు. విద్యార్థిని కిడ్నాప్ ఘటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ప్రెస్ మీట్ లు పెట్టడం కారణంగా విద్యార్థిని మానసికంగా కృంగి పోయిందని హెచ్చార్సీకి ఫిర్యాదు చేశారు.
పోలీసుల తొందరపాటు చర్యల వల్ల విద్యార్థిని జీవించే హక్కును కోల్పోయిందని ఆరోపించారు. ఘటనకు బాద్యులైన పోలీసులపై చర్యలు తీసుకొని, విద్యార్థిని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలంటూ కమిషన్ ను న్యాయవాది అరుణ్ కుమార్ ఆరోపించారు.