ఓవైపు కొండ పైనుంచి నీరు జాలువారుతుంటే.. ఇంకోవైపు చుట్టూ పచ్చదనం ఉంటే.. అంతేనా.. ఆ ఆహ్లాద వాతావరణంలో రైలు ప్రయాణం చేస్తే.. అబ్బా.. వెంటనే అక్కడకు వెళ్లాలని అనిపిస్తుంది కదా..?
గోవా-కర్ణాటక సరిహద్దు కొండ ప్రాంతం బ్రాగంజా ఘాట్స్ కు సంబంధించిన వీడియోను రైల్వే శాఖ ట్వీట్ చేసింది. ఎత్తైన కొండ పైనుంచి జలపాతాలు కిందకు జాలువారుతున్నాయి. కొండ మధ్యలో నుంచి రైలు వస్తోంది. ఆ దృశ్యాన్ని చూసి.. రెండు కళ్లు చాలడం లేదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ మార్గంలో రైలు ప్రయాణం పర్యాటకులకు ఎప్పుడూ మధురానుభూతిని కలిగిస్తుంటుంది. ఇప్పుడు వర్షం పడి జలపాతాలు జాలువారుతుంటే.. ఆ ఆనందం మరింత రెట్టింపు అయిందని అంటున్నారు నెటిజన్స్.