నవ్వించడానికే పుట్టిన నటులలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఒకరు. డైలాగ్ లేకుండా కేవలం ఎక్స్ప్రెషన్ తో కడుపుబ్బ నవ్విస్తాడు మీమ్స్ హీరో బ్రహ్మి. కొన్నేళ్ళ తపస్సు,అంతకు మించిన మేధస్సు, వేదాంతం, వైరాగ్యం,పరిణతి,ఫీలు, ఫిలాసఫీ కలగలిసిన నటన ఆయనది.
బ్రహ్మీ ఉంటే ఈ ట్రాక్ అదిరిపోతుంది. సినిమా ఓ లెవెల్ కి వెళ్తుంది. అనుకునే దర్శక నిర్మాతలున్నారు. వారి అంచనాలు ఎప్పుడూ వమ్ము చేయలేదు బ్రహ్మానందం. ఇది బ్రహ్మీతప్ప ఇంకెవ్వరూ చేయలేరు అనిపించడమే కాదు,అతని నటనతో వందరోజులు ఆడించాడు. అలాంటి వాటిలో దర్శకుడు శ్రీనువైట్ల తెరకెక్కించిన మెజారిటీ హిట్స్ ఉన్నాయి.
యావరేజ్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలను ప్రేక్షకులు మళ్లీమళ్లీ చూడటానికి బ్రహ్మానందం ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమయ్యారు. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఢీ, రెడీ, కింగ్ సినిమాల సక్సెస్ లో బ్రహ్మానందం కీలక పాత్ర పోషించారు. బాద్ షా,నమో వెంకటేశ సినిమాల సక్సెస్ కు కూడా బ్రహ్మానందం కారణమని కామెంట్లు వినిపిస్తాయి.
వి.వి.వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన కృష్ణ, అదుర్స్, అల్లుడు శ్రీను సినిమాలలో బ్రహ్మానందం పంచ్ లు ఏ రేంజ్ లో పేలాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన రేసుగుర్రం సినిమా సక్సెస్ లో కూడా బ్రహ్మానందం కీలక పాత్ర పోషించారు.
దూకుడు సినిమాలో బ్రహ్మానందం కామెడీని తీసేసి చూడలేం.ఆ సినిమా సక్సెస్ కు బ్రహ్మానందం కారణం కాగా ఆ మూవీలో ఎమ్మెస్ నారాయణ కామెడీ టైమింగ్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది.
కిక్, వెంకీ, దుబాయ్ శ్రీను, విక్రమార్కుడు, జాతిరత్నాలు సినిమాలలో కూడా బ్రహ్మానందం కామెడీ హైలెట్ గా నిలిచింది.జులాయి, అత్తారింటికి దారేది సినిమాలలోని బ్రహ్మానందం రోల్స్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. మన్మథుడు, జల్సా సినిమాలలో కూడా బహ్మానందం కామెడీ ఆకట్టుకుంది.
కొన్ని ఫ్లాప్ సినిమాలలో కూడా బ్రహ్మానందం కామెడీ బాగుంటుంది. బ్రహ్మానందంకు సంబంధించిన ఎన్నో మీమ్స్ సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి.
Also Read: తారకరత్న వైద్యఖర్చులు తమ బాధ్యతే అంటున్న లోకేశ్ ..!?