స్టార్ కమెడియన్ బ్రహ్మానందం తన కొడుకు గౌతమ్ ని స్టార్ హీరోగా చూడాలని కలలు కన్నాడు. అయితే, గౌతమ్ మాత్రం ఆ స్టార్డమ్
తెచ్చుకోటం లో విఫలమయ్యాడు. మను, బసంతి, పల్లకిలో పెళ్లికూతురు వంటి చిత్రాల్లో నటించినా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం సుబ్బు చెరుకూరి దర్శకత్వంలో ఎస్ ఒరిజినల్స్ బ్యానర్‌పై ఓ సినిమా చేస్తున్నాడు.
కాగా నేడు గౌతమ్ పుట్టినరోజును పురస్కరించుకుని, మేకర్స్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో మోనోఫోబియాతో బాధపడుతున్న వ్యక్తి పాత్రలో గౌతమ్ నటిస్తున్నారు.
ఆ సమస్యను ఎలా అధిగమిస్తాడు అనే దాని చుట్టూ ఈ కథ తిరుగుతుందట. ఇక ఈ సినిమాపైనే గౌతమ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.
Advertisements
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. జోన్స్ రూపర్ట్ సంగీత అందిస్తున్న ఈ సినిమాకు మోహన్ చారి కెమరామెన్ గా నటిస్తున్నాడు.