బ్రహ్మాస్త్ర మూవీ కొత్త టీజర్ సోషల్ మీడియాను దున్నేస్తోంది. ఆలియా భట్, రణబీర్ కపూర్ తో పాటు ఇతర స్టార్స్ ఉన్న ఈ టీజర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. సినిమాపై మరిన్ని అంచనాలను ఈ వీడియో పెంచేసిందని అంటున్నారు క్రిటిక్స్.
జూన్ 15న ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్లు చెబుతూ.. మంగళవారం టీజర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ సీన్లతో ఉన్న ఈ వీడియో చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించింది. ఈ మూవీలో శివుడిగా రణబీర్, ఈషాగా ఆలియా నటిస్తున్నారు.
ప్రొఫెసర్ అరవింద్ చతుర్వేది పాత్రను అమితాబ్ చేస్తుండగా.. పురావాస్తుశాఖ నిపుణుడు అజయ్ వశిష్ఠ్ పాత్రలో నాగార్జున నటిస్తున్నాడు. దమయంతీ పాత్రలో మౌనీ రాయ్ పోషిస్తోంది.
మూడు పార్ట్ లుగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. మొదటిది బ్రహ్మాస్త్ర శివ సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, రణబీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.