తాను మరణిస్తూ 8మందిని బ్రతికించాడు సైబరాబాద్ కమిషనరేట్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్. సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ స్పెషల్ పార్టీలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న కోనేరి ఆంజనేయులు ఈ నెల 18న డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. సోమన్‌గుర్తి గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాపడ్డాడు. తలకు బలమైన గాయం కావటంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆంజనేయులు బ్రెయిన్ డెడ్ అయ్యారు.
బ్రెయిన్ డెడ్ విషయాన్ని డాక్టర్లు ఆంజనేయులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు చెప్పారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆసుపత్రిలో ఆంజనేయులు కుటుంబ సభ్యులను కలిసి… తను మరణించినా, మరో 8మందిని బ్రతికించే అవకాశం ఉందని, అవయవదానంకు ఒప్పుకోవాలని కోరారు. దీంతో సీపీ సూచన మేరకు ఆంజనేయులు గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం, కళ్లు వంటి ఎనిమిది అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు.
కానిస్టేబుల్ ఆంజనేయులు అంత్యక్రియల్లో వీసీ సజ్జనార్ కూడా పాల్గొన్నారు. ఆయన చనిపోతూ మరో 8 మందికి ప్రాణం పోసిన ఆంజనేయులు పాడె మోశారు. అవయవదానం చేసి పలువురికి స్ఫూర్తిగా నిలవాలని కమిషనర్ కోరారు.