డబ్బిచ్చి తన్నించుకోవడమంటే ఇదేనేమో..! డబ్బులిస్తున్నామనే ధీమాతో అవతలి వాళ్ళు హర్ట్ అయ్యేలా ప్రవర్తిస్తే…న్యూటన్ మూడో సూత్రం ప్రకారం తీసుకున్న వాళ్ళు మనికి యాజ్ ఇట్ ఈజ్ తిరిగిచ్చేసే ప్రమాదం ఉంటుంది. ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లోని ఓ పెళ్ళివేడుకలో చర్యకు ప్రతిచర్య చర్య చోటు చేసుకుంది.
విచిత్రమేంటంటే పెళ్ళివెన్యూగా బుక్ చేసుకున్న హోటల్ సిబ్బంది అతిథులను చావగొట్టారు. రెండు పుంజీలు వీళ్ళూ కొట్టారనుకోండి..ఎంతైనా డబ్బిచ్చి వడ్డించడానికి పెట్టుకున్నవాడే నాలుగు వడ్డించడం విడ్డూరం కదా..!
ఇక విషయంలోకి వెళ్దాం. ఘజియాబాద్, మసూరి ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం పెళ్లి వేడుక నిర్వహించింది. దీని కోసం గోవింద్ పురిలో ఉన్న గ్రాండ్ ఐరిస్ హోటల్ బుక్ చేసుకుంది వరుడి తరఫు కుటుంబం.
పెళ్ళిరోజు సాయంత్రం అక్కడి హోటల్‌లో మెహిందీ వేడుక నిర్వహించారు.అయితే, హోటల్‌లో డీజేను అర్ధరాత్రి 02.00 గంటలకు ఆపేశారు. దీనిపై పెళ్లికి వచ్చిన అతిథులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మరికొంతసేపు డీజే పెట్టమని చెప్పారు. దీనికి హోటల్ సిబ్బంది నిరాకరించారు. ఈ క్రమంలో హోటల్ సిబ్బందికి, అతిథులకు మధ్య గొడవ తలెత్తింది.ఈ గొడవ పెద్దదైంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
ముఖ్యంగా హోటల్ సిబ్బంది, బౌన్సర్లు కలిపి వరుడితోపాటు, అతడి బంధువులపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.దీనిపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు ఇప్పటివరకు తొమ్మిది మందిని అరెస్టు చేశారు.
మరి కొందరు పరారీలో ఉండటంతో వారి కోసం వెతుకుతున్నారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
उप्र में भाजपा ने क़ानून-व्यवस्था का अंतिम संस्कार कर दिया है। pic.twitter.com/Z4vrY70PBd
— Akhilesh Yadav (@yadavakhilesh) February 26, 2023