87 సంవత్సరాల నుండి జరుగుతున్న రంజీ ట్రోఫికి ఈ ఏడు బ్రేక్ పడనుంది. ఐపియల్ ఈ బ్రేక్ కు కారణం కానుంది. 1896-1902 మధ్య కాలంలో ఇంగ్లాండ్ కోసం 15 టెస్ట్ లు ఆడిన రంజిత్ సింగ్ పేరు మీదుగా స్టార్ట్ అయిన ఈ రంజీ ట్రోపి 87 ఏళ్లుగా కొనసాగుతుంది. రంజీ ట్రోఫిలో ముంబాయ్ 41 సార్లు విజేతగా నిల్చింది. వసీం జాఫర్ ఈ రంజీ టోర్నమెంట్ లో 10 వేల పైచిలుకు పరుగులు సాధించి టాప్ బ్యాట్స్ మన్ గా ఉన్నారు.
ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న లెగ్ గ్లాన్స్, లేట్ కట్ లాంటి షాట్లు రంజిత్ సింగ్ సృష్టించినవే!ఈ ఏడాది రంజీ ట్రోఫి స్థానంలో విజయ్ హజారే ట్రోపిని నిర్వహించనున్నారు. రంజీ ట్రోఫి నిర్వాహణకు ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఆ స్థానంలో విజయ్ హజారే ట్రోఫిని నిర్వహించనుంది బిసిసిఐ. రెండు ట్రోఫిలు నిర్వహిస్తే ఐపియల్ నిర్వాహణకు కష్టమౌతుందన్న కారణంతో ఈ సారి రంజీ ట్రోఫిని తొలగించనున్నారు. ఇక విజయ్ హజారే ట్రోఫిలో ఆడే ప్రతి క్రీడాకారుడికి 1.5 లక్షల రూపాయలు చెల్లించనుంది బిసిసిఐ.