ఎన్నికల నగారా మోగడానికి సమయం ఆసన్నమవుతున్న తరుణంలో ప్రముఖ పార్టీల్లో నేతల చేరికలు మొదలయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న సీనియర్ పొలిటీషియన్స్ కూడా రంగప్రవేశం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
ఇక తెలుగు రాష్ట్రాల విభజన అనంతరం సొంత పార్టీ పెట్టుకొని కేవలం ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేశారు ఆయన. ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాని గత కొంత కాలంగా సైలెంట్ గా ఉన్నారు. కాగా రెండు రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి త్వరలోనే బీజేపీలో చేరుతారనే సమాచారం అందుతోంది.
ఎన్నికల కసరత్తులో భాగంగా తెలంగాణ బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారని విశ్వనీయ సమాచారం. దీంతో ఆయన హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ బీజేపీలో కీ రోల్ ప్లే చేయబోతున్నట్టు తెలుస్తోంది.