సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌తో తరచూ డ్రగ్స్ లింక్స్ బయటపడుతున్నాయి. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసి విచారణ కూడా జరుపుతోంది. ఈ కమ్రంలో తాజాగా టాలీవుడ్‌కి చెందిన నటి ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టుగా ఎన్‌సీబీ ప్రకటించింది. ముంబైలోని మీరా రోడ్‌లోని ఓ హోటల్‌పై జరిపిన దాడిలో ఆమె పట్టుబడినట్టుగా తెలిపింది.
టాలీవుడ్ నటితో పాటుగా ఈ దాడుల్లో చాంద్ మహమ్మద్ అనే డ్రగ్ పెడ్లర్ కూడా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినట్టుగా వెల్లడించింది. నిందితుని నుంచి రూ. 8-10 లక్షల విలువ చేసే 400 గ్రాముల డ్రగ్స్ దొరికినట్టుగా వివరించింది. కాగా మరో డ్రగ్స్ సరఫరాదారు సయ్యీద్ పరారయ్యాడని.. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఎన్‌సీబీ తెలిపింది. కాగా పట్టుబడిన నటి వివరాలేవి బయటపెట్టలేదని ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.