మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శ్రీరామ నవమి రోజున పెను ప్రమాదం జరిగింది. ఇక్కడి స్నేహ నగర్ సమీపంలోని పటేల్ నగర్‌లోని శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయం వద్ద మెట్ల బావి పైకప్పు కూలడంతో 25 మందికి పైగా భక్తులు మెట్ల బావిలో పడిపోయారు.
ఈ ఘటనలో 10 మందికి గాయాలైనట్టు సమాచారం. మెట్టుబావిలో పడిన వారిని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా చాలా సేపటి వరకు అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్, 108 వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకోలేదని తెలుస్తోంది.
కొంత మందిని స్థానికులే ఎలాగోలా బయటకు తీశారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది.కొంత సేపటి తరువాత అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బావిలో పడిన వారిని రెస్క్యూ టీంతో పాటు నిచ్చెన సాయంతో బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు.