కరోనా నేపథ్యంలో ప్రస్తుతం అనేక చోట్ల పరిమిత సంఖ్యలో అతిథులతో మాత్రమే వివాహాలు, ఇతర శుభ కార్యాలు జరుపుకుంటున్నారు. ఇక కొందరైతే అనివార్యం అయితేనే ఆయా కార్యాలను నిర్వహిస్తున్నారు. లేదంటే వాయిదా వేసుకుంటున్నారు. అయితే ఆ జంటలో పెళ్లి కూతురికి కరోనా ఉన్నప్పటికీ వారు వివాహాన్ని మాత్రం వాయిదా వేయలేదు. అలా అని చెప్పి వారు దగ్గర దగ్గర ఉండి వివాహం చేసుకోలేదు. మరి ఎలా వివాహం చేసుకున్నారంటే…
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ప్యాట్రిక్ డెల్గాడో, లారెన్ జిమెనెజ్‌లు 2019 మే నెలలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈ ఏడాదిలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ కరోనా వల్ల వారి వివాహం ఆలస్యం అయింది. అయితే పలుమార్లు వాయిదా వేసినా ఈసారి ఎలాగైనా సరే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ లారెన్‌కు పెళ్లికి సరిగ్గా 3 రోజుల ముందుగా కోవిడ్ ఉన్నట్లు నిర్దారణ అయింది. దీంతో వారు ఒక దశలో వివాహాన్ని వాయిదా వేద్దామనుకున్నారు. కానీ ఎట్టకేలకు వినూత్న పద్ధతిలో వివాహం చేసుకుందామని చెప్పి ఆ శుభ కార్యాన్ని వాయిదా వేయలేదు.
లారెన్ కోవిడ్ కారణంగా ఇంట్లోనే చికిత్స తీసుకుంటుండడంతో ఆమె పెళ్లి రోజు వెడ్డింగ్ డ్రెస్‌లో తన ఇంట్లో బాల్కనీలో నిలబడింది. ఇంటి కింద ప్యాట్రిక్ వెడ్డింగ్ డ్రెస్‌తో పూల బొకేలతో నిలబడ్డాడు. 10 మంది గెస్టులు వచ్చారు. ఈ క్రమంలో ఒక పొడవాటి రిబ్బన్‌ను వారిద్దరూ పట్టుకున్నారు. కింది నుంచి ఆ రిబ్బన్ ను పైకి పంపగా లారెన్ బాల్కనీలో ఆ రిబ్బన్ పట్టుకుంది. అనంతరం వివాహ వాగ్దానాలను ఇచ్చి పుచ్చుకున్నారు. వారి వివాహం జరిగిపోయింది.
కాగా అలా వెరైటీగా వారు వివాహం చేసుకునే సరికి వారి పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కోవిడ్ ఉన్నప్పటికీ అలా వెరైటీగా పెళ్లి చేసుకున్నందుకు నెటిజన్లు వారిని అభినందిస్తున్నారు. కొందరైతే వారి లాగే పెళ్లి చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ఏమో మరి.. వారిలా కొందరు అనుకరించి పెళ్లిళ్లు చేసుకుంటారేమో.. చూడాలి..!
Advertisements