సీఏఏ, ఎన్.ఆర్.సి లకు వ్యతిరేకంగా కేరళ లో ఓ పెళ్లి కొడుకు వినూత్న నిరసన తెలిపాడు. హజా హుస్సేన్ అనే వ్యాపారి ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి కొడుకుగా ముస్తాబైన హుస్సేన్ తిరువనంతపురం నుంచి దాదాపు 20 కిలో మీటర్ల దూరంలోని పెళ్లి వేదికైన వాజిమక్కుకు ఒంటెపై ఊరేగింపుగా బయలుదేరాడు. ఊరేగింపులో ఆయన ఒంటెపై కూర్చొని రిజెక్ట్ సీఏఏ, బాయ్ కాట్ ఎన్.ఆర్.సి అంటూ రాసి ఉన్న ప్లకార్డును పట్టుకున్నారు. ఆయన వెంట వచ్చే బంధువులంతా సీఏఏ, ఎన్.ఆర్.సిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అతడి ఊరేగింపు సాగిన ప్రాంతమంతా సీఏఏ వ్యతిరేక నినాదాలతో మారుమ్రోగింది. రోడ్లపై ప్రజలంతా అతడినే చూస్తుండిపోయారు. హస్సేను తన భార్యకు రాజ్యాంగ ప్రతిని గిప్ట్ గా ఇచ్చాడు.