బీహార్లోని బెగుసరాయ్ కు చెందిన సౌరవ్ కుమార్ కు రహోట్లీ గ్రామానికి చెందిన రాజేష్ సహానీ కూతురితో పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి అబ్బాయి తరఫు నుండి 120 మంది ఊరేగింపుగా డప్పుల మోతతో వచ్చారు. డాన్స్ లు చేస్తూ వరుడిని స్టేజ్ మీదకు తీసుకొచ్చారు. పెళ్లి హడావుడిలో పడి తినకుండా ఉండడం, మోతాదుకు మించిన సౌండ్స్ , శక్తి లేకున్నా డాన్స్ చేయడంతో…. దండలు మార్చుకునే సమయంలో వరుడికి ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ వచ్చి అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు.
ఈ సంఘటనతో ఆవేశానికి లోనైన పెళ్లికూతురి తరఫు బందువులు…అబ్బాయి తరఫున ఊరేగింపుగా వచ్చిన వాళ్లల్లో దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. పెద్ద మనుషుల పంచాయితీ పెట్టించి….వీక్ హార్ట్ ఉన్న వాడిని తమ కూతురికి అంటగట్టాలని చూశారంటూ…పెళ్లి కొడుకు తండ్రి నుండి 2.5 లక్షల నష్టపరిహారం వసూల్ చేశారు.!